వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదు

98744చూసినవారు
వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై కేసు నమోదు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానికి షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా.. మంగళవారం వైసీపీ అనుచరులతో కలిసి దౌర్జన్యం చేశారు. ఈ మేరకు కానిస్టేబుల్ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో చిలకలపూడి పీఎస్ లో ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఫర్నిచర్ ధ్వంసం చేసినందుకు సెక్షన్ 427 కింద పేర్ని నానితో పాటు మరికొంత మందిపై కేసు ఫైల్ చేశారు.

సంబంధిత పోస్ట్