రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీ బిహార్‌లో పోటీచేసే 23 లోక్‌సభ స్థానాల్లో సీవాన్ మినహా 22 స్థానాలకు అభ్యర్థుల్ని లాంఛనంగా ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ కుమార్తెలిద్దరూ ఈసారి బరిలో దిగుతున్నారు. లాలూ పలుమార్లు నెగ్గిన శరణ్ నియోజకవర్గం నుంచి ఒక కుమార్తె రోహిణీ ఆచార్య పోటీ చేయనున్నారు. ఆయన పెద్దకుమార్తె మీసా భారతి పాటలీపుత్ర లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.