వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరుడు అరెస్ట్

70చూసినవారు
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరుడు అరెస్ట్
వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడు దాదాపీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపీర్‌పై పోక్సో, అత్యాచారం కేసు నమోదైనట్లు ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. దాదాపీర్ శారీరకంగా, మానసికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్