బడ్జెట్ నిధులతో ఎంతో ఊరట: సీఎం చంద్రబాబు

85చూసినవారు
బడ్జెట్ నిధులతో ఎంతో ఊరట: సీఎం చంద్రబాబు
ఆర్థికంగా కూరుకుపోయిన రాష్ట్రానికి బడ్జెట్ నిధులు ఎంతో ఊరటనిస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. 'వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం పూచీకత్తుతో ఇస్తుంది. అప్పు రూపంలో అయినా 30 ఏళ్లు తర్వాతే తీర్చేది. మరికొంత కేంద్ర గ్రాంట్ క్యాపిటల్ అసిస్టెన్స్ రూపంలో వస్తుంది. పోలవరానికి నిధులు ఎంత అని చెప్పలేదు. దాన్ని పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పింది' అని మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్