ఇటీవల రైలులో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోకి దొంగలు చొరబడ్డారు. నిద్రిస్తున్న ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడలో బంగారం లాక్కొని అక్కడ నుంచి ఉడాయించారు. దాంతో బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.