పుష్ప-2 మూవీ హిట్‌ను ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను అల్లు అర్జున్ కలిసి రాజకీయ రంగ ప్రవేశంపై చర్చించినట్లు సమాచారం. ఐదేళ్ల పాటు సామాజిక సేవ చేసి, ఆ తర్వాత రాజకీయాల్లోకి రావాలని అల్లు అర్జున్‌కు ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు తెలుస్తోంది.