Airtel తన కస్టమర్ల కోసం న్యూ ఇయర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో రూ.1999తో రీఛార్జీ చేసుకుంటే వన్ ఇయర్ వ్యాలిడిటీతో పాటు అన్ లిమటెడ్ కాలింగ్ ఆప్షన్ లభిస్తుంది. డేటా మాత్రం 24GB, రోజువారీ 100 SMSల ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా ఎయిర్‌టెల్ Xstream యాప్‌కు యాక్సెస్ లభిస్తుంది. అలాగే అపోలో 24*7 సర్కిల్ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్‌లో ఉచిత హలో ట్యూన్‌ను పొందవచ్చు.