నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ అందించారు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 14న విడుదల చేస్తామని పోస్టర్ రిలీజ్ చేసారు.