మహిళా సంఘాల సభ్యులకు యూనిఫాం చీరలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికి యూనిఫాం చీరలను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో చీరల నమూనాలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పరిశీలించారు. సీఎం తుది నిర్ణయం తర్వాత మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.