ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

84చూసినవారు
ఘోర ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం
కృష్ణా జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉంగుటూరు మండలం ఆత్కూరులో జాతీయ రహదారిపై లారీ టైర్ పంచర్ కావడంతో రోడ్డు పక్కనే నిలిపాడు. మరో ట్రాలీ డ్రైవర్ సహాయం కోసం దిగి.. ఇద్దరూ టైర్లు బిగిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన సిమెంట్ లోడ్ లారీ ఢీకొట్టింది. దాంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్