వరద బాధితుడి చెంపపై కొట్టిన VRO

58చూసినవారు
వరద బాధితుడి చెంపపై కొట్టిన VRO
విజయవాడలో వరద బాధితుడిపై వీఆర్వో విజయలక్ష్మి చెయ్యి చేసుకున్నారు. బాధితుడి చెంపపై ఆమె కొట్టారు. అజిత్‌నగర్ షాదిఖానా రోడ్డులో ఈ ఘటన జరిగింది. ఆహారం, తాగు నీరు ఇవ్వడం లేదని వరద బాధితులు ఆందోళన చేపడుతున్నారు. ఫిర్యాదు చేసినా వీఆర్వో విజయలక్ష్మి పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. ఈ క్రమంలో వీఆర్వోకు వరద బాధితుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో విజయలక్ష్మి బాధితుడిపై చెయ్యి చేసుకున్నారు. వీఆర్వో విజయలక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు.

సంబంధిత పోస్ట్