మాకు ఇది 3 టెస్టుల సిరీస్‌: శుభ్‌మన్ గిల్

75చూసినవారు
BGTలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్‌ బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. ‘‘అడిలైడ్‌లో మేం అనుకున్నట్లు ఫలితం రాలేదు. అందుకు మరీ ఆందోళన పడటం లేదు. ఇక నుంచి మేం మూడు టెస్టుల సిరీస్‌గా భావించి ఆడతాం. ఈ మ్యాచ్‌లో మేం గెలిస్తే.. మెల్‌బోర్న్, సిడ్నీలోనూ పైచేయి సాధిస్తాం. గబ్బాలో మేం మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన చరిత్ర ఉంది’’ అని గిల్ వెల్లడించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్