ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు భారత క్రికెటర్ శుభ్‌మన్ గిల్ అభినందనలు తెలిపాడు. ‘‘భారత జట్టు నుంచి అతడికి అభినందనలు చెబుతున్నాం. పిన్న వయసులోనే అరుదైన ఫీట్‌ను సాధించడం దేశానికే గర్వకారణం’’ అని గిల్ ప్రశంసించాడు. ఐసీసీ అధ్యక్షుడు జై షా స్పందిస్తూ.. ‘‘కంగ్రాట్స్ గుకేశ్. దేశం గర్వపడేలా చేశావు. భవిష్యత్తులోనూ మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పోస్టు పెట్టారు.