సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ ఉప-వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏకసభ్య కమిషన్ ఈ నెల 16 నుంచి 19 వరకు వరుసగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో పర్యటించనుంది. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై మెమొరాండం స్వీకరించనున్నారు.