కేవలం రూ.10వేలకే కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వచ్చింది. మోటోరొలా 'జీ' సిరీస్‌లో మరో మొబైల్‌ను లాంఛ్ చేసింది. 'Moto G35 5G' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హల్లో యూఐ స్కిన్‌తో రన్ అవుతుంది. డిస్‌ప్లే 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ, రిఫ్రెష్ రేటు 120Hz, బ్యాటరీ 5,000mAh ఇచ్చారు. ఫోన్లో వెనకవైపు 50 ఎంపీ, అల్ట్రా వైడ్ యాంగిల్‌తో 8 ఎంపీ సెన్సర్, ముందువైపు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను అమర్చారు.