Realme 14x 5G డిసెంబర్ 18న మార్కెట్లోకి వస్తోంది. ఇది బ్లాక్, గోల్డ్, రెడ్ కలర్ ఆప్షన్స్‌లో రానుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. వెనుక ప్యానెల్‌లో Realme ‘డైమండ్-కట్ డిజైన్’, IP68+IP69 రేటింగ్‌ను కలిగి ఉంది. కెమెరా మాడ్యూల్ LED ఫ్లాష్ స్ట్రిప్‌తో పాటు నిలువుగా మూడు సెన్సార్‌లను కలిగి ఉంది. మొబైల్ 6GB RAM+128GB, 8GB RAM +128GB, 8GB RAM+256GB ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది.