కర్ణాటక బెంగళూరు రూరల్ పరిధిలోని అనేకల్ తాలూకాలో శనివారం విషాద ఘటన జరిగింది. దొడ్డనాగమంగళ, రాయసంద్ర గ్రామాలలో శతాబ్ధాల నాటి నుంచి హుస్కూర్ మధురమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా 150 అడుగుల భారీ రథాన్ని భక్తులు లాగుతుండగా అది కూలిపోయింది. రథం మీద పడడంతో ఒక భక్తుడు చనిపోయాడు. రథం కూలుతుండగా పలువురు పరుగులు పెట్టి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.