రూ.13,500 కోట్ల మోసం కేసు.. బెల్జియంలో మెహుల్ చోక్సీ

70చూసినవారు
రూ.13,500 కోట్ల మోసం కేసు.. బెల్జియంలో మెహుల్ చోక్సీ
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో పరారైన ప్రముఖ వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలో నివసిస్తున్నారు. భార్య ప్రీతి చోక్సీతో కలిసి ఆ దేశంలో 'రెసిడెన్సీ కార్డ్'ను పొందినట్లు కేంద్రం గుర్తించింది. అతడిని అప్పగించాలని బెల్జియం అధికారులను భారత్ కోరనుంది. బెల్జియంకు వెళ్లే ముందు ఆంటిగ్వా, బార్బుడాలో ఆయన నివసించినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.

సంబంధిత పోస్ట్