AP: తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కఓలు, బలభద్రపురంలలో సుమారు 200 మంది క్యాన్సర్ బారిన పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్నిఎమ్మెల్యే నల్లమిల్లి కూడా అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో, ఈరోజు గ్రామంలో ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ.. ఇప్పటికే 23 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో నీరు, గాలి కాలుష్యం కావడంతో గ్రామస్థులకు ఈ పరిస్థితి వచ్చినట్లు భావిస్తున్నారు