TG: ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై కూరగాయల సాగు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి కొండా లక్ష్మణ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదనలు చేసింది. పాఠశాలల్లో కూరగాయల సాగు, పండ్ల మొక్కల పెంపకం చేపట్టాలని, దీనిద్వారా మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన కూరగాయలు, పండ్లు లభ్యమవుతాయని తెలిపింది. విద్యార్థులకు సాగుపై అవగాహన కలుగుతుందని పేర్కొంది. కాగా, ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో SKLTSHU ప్రయోగాత్మకంగా వీటిని సాగుచేస్తోంది.