పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధిపై కలెక్టర్ల సదస్సులో చర్చ జరిగింది. గ్లోబల్ స్థాయి ఉద్యోగాలకు నైపుణ్యాభివృద్ధి పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. 'గతంలో నాక్ అక్రెడిషన్‌లో ఏపీ వర్సిటీలు టాప్-10లో ఉండేవి. ప్రస్తుతం టాప్-10లో ఒక్క వర్సిటీ లేకపోవడం శోచనీయం. పాఠ్యాంశాలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉండాలి. గ్లోబల్ స్థాయిలో నైపుణ్యాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలి. వర్చువల్ వర్కింగ్ కోసం ఓ విధానం రూపొందించాలి. వర్చువల్ వర్కింగ్ హబ్‌గా ఏపీ మారాలన్నదే లక్ష్యం' అని తెలిపారు.