అల్లు అర్జున్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

58చూసినవారు
అల్లు అర్జున్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
HYDలోని సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప-2' తొక్కిసలాట విషయంలో హీరో అల్లు అర్జున్, చిక్కడపల్లి పోలీసులపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు హైకోర్టు న్యాయవాది రామారావు తెలిపారు. 'షోకు అల్లు అర్జున్ వస్తున్న విషయంపై సమాచారం లేదంటూ పోలీసులు తప్పించుకుంటున్నారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం దారుణం. రేవతి కుటుంబానికి రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి. నిందితులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ ను కోరాను' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్