అయ్యప్ప భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు

63చూసినవారు
అయ్యప్ప భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు
అయ్యప్ప మాల ధారణ చేసిన భక్తులు కొన్ని నియమ నిబంధనలు తప్పక పాటించాలి. స్వాములు తెల్లవారుజామున నిద్రలేవాలి. చన్నీటితో స్నానం చేసి.. ఉదయం 6 గంటల్లోపు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. ప్యాంటు ధరించి పూజ చేయవద్దు. నల్ల లుంగీ, కండువా ధరించి మాత్రమే స్వామివారిని పూజించాలి. నేలపైనే నిద్రించాలి. స్వాములు ఎవరితో వాగ్వాదానికి దిగవద్దు. శాంతితో మెలగాలి. పరుపులు, దిండ్లు, పాదరక్షలు వాడరాదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్