AP: రాష్ట్రంలో హాట్ సీట్ అయిన పిఠాపురం వైపు అందరి చూపు ఉంది. ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ గెలుస్తారా? లేదా
వైసీపీ అభ్యర్థి వంగా గీత విజయం సాధిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో రెండు చోట్ల ఓడిన పవన్ ఈసారి తప్పకుండా గెలుపొంది.. అసెంబ్లీకి వెళతారని జనసేన నేతలు చెబుతున్నారు. పవన్‌పై వంగా గీత విజయం సాధించి.. డిప్యూటీ సీఎం అవ్వడం ఖాయమని
వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.