అల్లు అర్జున్ ప‌ర్య‌ట‌న.. ఎస్పీపై చ‌ర్య‌లు

35905చూసినవారు
అల్లు అర్జున్ ప‌ర్య‌ట‌న.. ఎస్పీపై చ‌ర్య‌లు
నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్‌రెడ్డి, సీఐ రాజారెడ్డిపైనా విచారణ జరపాలని పేర్కొంది. నిన్న న‌టుడు అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు అనుమతి లేకపోయినా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో ఈసీ చర్యలకు ఉప‌క్ర‌మించింది.

సంబంధిత పోస్ట్