అనంతగిరి: నీట మునిగిన వరి పంటలు

64చూసినవారు
అనంతగిరి: నీట మునిగిన వరి పంటలు
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో అనంతగిరి మండలంలోని రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురిశాయి. దీంతో మండలంలోని ఎగువసోభ పంచాయతీ పరిధి కే. జంగుడ గ్రామంలో కోత కోసిన వరి పంటలు నీట మునిగాయి. చేతి కొచ్చిన వరి పంటలు నూర్పుల సమయంలో నీట మునగడంతో గ్రామంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పలువురు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులే గుర్తించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు లచ్చు తదితరులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్