పర్యటక కేంద్రమైన అరకులోయ మన్యంలో చలిపులి పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికి పోతున్నారు. బుధవారం తెల్లవారుజాము దట్టమైన పొగమంచు కొమ్ముకొని చలి తీవ్రత పెరగడంతో ఇళ్ల నుంచి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. పెరిగిన చలితో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.