75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అరకులోయ మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మంగళవారం పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించాలని అప్పుడు ప్రతి వర్గానికి మేలు చేకూరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకులోయ జడ్పిటిసి రోషిణి, ఎంపిపి ఉషారాణి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రమేష్ తదితరులున్నారు.