ముంచంగిపుట్టు మండలంలోని భోగి వేడుకలు సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండలంలోని బూసిపుట్ తదితర గ్రామాల్లో సంక్రాంతి శోభతో తెలుగు లోగిల్లు వెలుగులీనుతున్నాయి. భోగ భాగ్యాల సంక్రాంతిని ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. బూసిపుట్ తదితర గ్రామాల్లో గిరిజనులు సోమవారం రాత్రి భోగి మంటలు వేసి ఆటపాటలతో సందడి చేస్తున్నారు. మండలంలోని గ్రామాల్లో సంక్రాంతి సందడి వాతావరణం మొదలైంది.