నిమ్మచెట్టు గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు

68చూసినవారు
గూడెంకొత్తవీధి మండలంలోని మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దారకొండ పంచాయతీ పరిధి నిమ్మచెట్టు గ్రామానికి వెళ్లే వాగు పొంగి వరద నీరు ప్రవహిస్తుండడంతో నిమ్మచెట్టు గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి నిమ్మచెట్టు గ్రామానికి వెళ్లే రహదారిపై వంతెన నిర్మించి తమ యొక్క కష్టాలు తీర్చాలని శనివారం మధ్యాహ్నం కోరారు.

సంబంధిత పోస్ట్