అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని భీమిలి వైసీపీ నేతలు ఆరోపించారు. కరెంటు ఛార్జీల పెంపుపై శుక్రవారం చిట్టివలసలో వైసీపీ నేతలు ర్యాలీ చేసి విద్యుత్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలపై 6 నెలల్లోనే రూ.15 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపారని మండిపడ్డారు. వైస్ ఎంపీపీ బోని బంగారు నాయుడు పాల్గొన్నారు.