విశాఖలోని గాదిరాజు ప్యాలస్ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రెడాయ్ 10వ ఎడిషన్ ప్రాపర్టీ ఎక్స్ పోను శుక్రవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీ కృష్ణ శ్రీనివాస్, పి. విష్ణు కుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ కృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి నుంచి రియల్ ఎస్టేట్ బూమ్ పెరుగుతోందని పేర్కొన్నారు.