తిరుమలలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరంమని రాష్ట్ర కో-ఆపరేటివ్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు. గురువారం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైజాగ్ నుంచి తిరుపతిలో జరిగిన ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు.