ప్రజల ఐక్యతకు ప్రతీకగా వనభోజనాలు నిలుస్తాయని గొంప టీడీపీ నేతలు పల్లా జగ్గారావు, పల్లా త్రిమూర్తులు పేర్కొన్నారు. కార్తీకమాసం సందర్భంగా బుధవారం పల్లా వారి జంక్షన్ సమీపంలోని పల్లా వారి ఇంటి దగ్గర పల్లా జగ్గారావు, పల్లా త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వనభోజన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చోడవరం శాసనసభ్యులు కె ఎస్ ఎన్ ఎస్ రాజు, రాష్ర్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు.