విశాఖ డెయిరీ ఇటీవల తగ్గించిన పాల ధరలను వెంటనే పెంచాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఆదివారం చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిరిసొల్ల చిన్నం నాయుడు, మహదేవ్ చిన్నారి, పండూరి చిన్నం నాయుడు, మహదేవ్ వాసు, ఈల్లపుచిన సత్యారావు తదితరులు పాల్గొని తగ్గించిన పాల ధర వల్ల రైతులు నష్ట పోతున్నారని వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు.