నేషనల్ హైవేపై ఉన్న గ్రీన్ బెల్ట్ లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన 52 వార్డు పరిధిలోని మర్రిపాలెం గ్రీన్ బెల్ట్, ఆర్ అండ్ బి శివ శివాని స్కూల్ ఏరియా, కరాస, ఎన్. ఎ. డి జంక్షన్ తదితర ప్రాంతాలలో డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, ఇతర అధికారులతో కలిసి పర్యటించారు.