
విశాఖ: ఆర్టీసీ డిపోల్లో స్వర్ణాంధ్ర - స్వచ్ఛంధ్ర కార్యక్రమం
ఏపీఎస్ఆర్టీసీ విశాఖ జిల్లాలోని మద్దిలపాలెం, వాల్తేర్, సింహాచలం, మధురవాడ, గాజువాక, విశాఖ స్టీల్ సిటీ బస్కాంప్లెక్స్లలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని, డిపో ఆవరణలో టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని ప్రతిజ్ఞ చేశారు. ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు, వివిధ డిపోల అధికారులు పాల్గొన్నారు.