విశాఖ బీచ్ రోడ్ లో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దసరా కావడంతో మందుబాబులు మద్యం సేవించి వాహనాలు నడుపుకుంటూ వస్తున్నారు. అటువంటి వారిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నిర్వహించి కేసులు నమోదు చేశారు. అలాగే జరిమానా కూడా విధించారు. బీచ్ రోడ్ లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి.