వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం విశాఖ విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామికి జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ స్వాగతం పలికారు. గురువారం రాత్రి నగరానికి చేరుకున్న మంత్రి రాత్రి స్థానిక సర్క్యూట్ హౌస్ లో బస చేశారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కాసేపు వివిధ అంశాలపై మాట్లాడారు.