మంత్రి కొండా సురేఖ ఆరోపణలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కొండా సురేఖపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాహుల్‌గాంధీ, రేవంత్ రెడ్డిని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇందుకోసం 72 గంటల సమయం ఇస్తున్నానని అన్నారు. సమంత ఇంటికి, నాగార్జున ఇంటికి వెళ్లి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలతో సమంత ఎంతో క్షోభకు గురై ఉంటారని అన్నారు.