ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం ఆర్డీఓ వివి. రమణకు వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఎ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించినప్పటికీ నర్సీపట్నంలో పలు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. తక్షణమే ఈ పాఠశాలలు, కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.