వచ్చే నెలలో స్టీల్ ప్లాంట్ రెండవ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంఛార్జ్ సీఎండీ అరుణ్ కాంతి బాగ్చీ తెలిపారు. ఈ నెలాఖరులో ఒక ఫర్నేస్లో 7వేల టన్నుల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 18న కేంద్రం నుంచి రూ. ఐదువేల కోట్లు విడుదలైనట్లు ఆదివారం పేర్కొన్నారు.