గాజువాకలో యువతిపై ప్రేమోన్మాది దాడి
పెదగంట్యాడ మండలం బాల చెరువు సమీపంలో గురువారం ఓ యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. గత కొంతకాలంగా ప్రేమించాలంటూ జమ్మూ కాశ్మీర్ కు చెందిన నీరజ్ శర్మ, ఓ యువతిని వేధిస్తున్నాడు. ఆమె పట్టించుకోకపోవడంతో ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. చికిత్స కోసం బంధువులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు న్యూ పోర్ట్ పోలీసులు విచారణ చేపట్టారు.