దీన్ దయాళ్ సేవలు మరువలేనివి

57చూసినవారు
దీన్ దయాళ్ సేవలు మరువలేనివి
పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 108వ జయంతి వేడుకలు బుధవారం అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల ఘనంగా నిర్వహించుకున్నారు. దాంట్లో భాగంగా మాడుగుల బిజెపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో దీన్ దయాళ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా బిజెపి ఇన్చార్జి పుట్ట గంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మండల సంతోషి సుబ్బలక్ష్మి, జనసేన మహేష్, నానాజీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్