భారతదేశంలో పౌరులందరూ రాజ్యాంగాన్ని గౌరవించి కాపాడడమే రాజ్యాంగ నిర్మాతలకు ఇచ్చిన నిజమైన నివాలులని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మంగళవారం మాడుగుల బస్టాండ్లో గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కార్యకర్తలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.