మాడుగుల ఆర్టీసీ కాంప్లెక్స్ వినియోగానికి రూట్ సర్వే

60చూసినవారు
సుమారు 20 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న మాడుగుల ఆర్టీసీ కాంప్లెక్స్ కు బస్సులు రాకపోకలు సాగించాలని కోరుతూ పార్టీలకతీతంగా మాడుగుల యువత నడుం బిగించింది. దీంతో మంగళవారం గ్రామ సర్పంచ్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామ యువత మాడుగుల బస్టాండ్ నుంచి ఆర్టిసి కాంప్లెక్స్ వరకు, అక్కడ నుంచి ఎరకల వీధి వరకు రూట్ సర్వే చేసి, ఈ మార్గాన్ని బస్సుల రాకపోకలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్