గొలుగొండ మండలం లింగంపేట పంచాయతీ రామచంద్రపురం గ్రామంలో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం షటిల్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ టోర్నమెంట్ ను కృష్ణదేవిపేట ఎస్ఐ వై. తారకేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పండుగ రోజుల్లో ఇటువంటి టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు యువకులు పాల్గొన్నారు.