నర్సీపట్నం: 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు

52చూసినవారు
నర్సీపట్నంలో 220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు అయిందని ఈపీడీసీఎల్ డివిజనల్ ఇంజినీర్ రామకృష్ణ మంగళవారం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో ఈ నెల 7న ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రూ. 67. 35 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మిస్తున్నారని తెలిపారు. దీని వల్ల నిరంతరం విద్యుత్ సరఫరా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ అసిస్టెంట్ డీఈ త్రినాధ రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్