గంజాయి జోలికి వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

67చూసినవారు
గంజాయి జోలికి వెళ్లి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
జీ. మాడుగుల మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం టి. ఎన్. ఎస్. ఎఫ్ నాయకులు విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. అరకు పార్లమెంట్ టి. ఎన్. ఎస్. ఎఫ్ ప్రధాన కార్యదర్శి వనుగు త్రినాధ్ మాట్లాడుతూ యువత గంజాయి కు దూరంగా ఉండాలని గంజాయి జోలికి వెళ్లి మీ బంగారు భవిష్యత్తు ను నాశనం చేసుకో వద్దన్నారు. గంజాయి జోలికి వెళ్లి అనేక కుటుంబలు రోడ్డున పడిన పరిస్థితి ఉందని అటువంటి చెడు అలవాటులకు విద్యార్థులు, యువత, దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్