గూడెంకొత్తవీధి మండలంలోని దారకొండ అటవీ ప్రాంతంలోని పెద్దపులి హల్ చల్ చేస్తూ సంచరిస్తుందని గిరిజనులు తెలిపారు. ఆదివారం ఉదయం పాడేరు నుంచి గూడెంకొత్తవీధికి ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో దారకొండ ఘాట్ రోడ్డుపై పెద్దపులి సంచరిస్తుండగా ఆ వీడియోను కొంతమంది ఆరోగ్య సిబ్బంది తమ ఫోన్లో బంధించామని తెలిపారు. ఈ అటవీ ప్రాంతం వైపు ఎవరు వెళ్ళొద్దని పెద్దపులి పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.